కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టి.. మా ఎమ్మెల్యేలను గుంజుకోవాలని చూస్తోంది: హరీశ్‌రావు
- ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే కాంగ్రెస్ పనంటూ మాజీమంత్రి విమర్శ
- కాంగ్రెస్ పార్టీలో చేరకుంటే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపణ
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసిందంటూ హరీశ్‌రావు మండిపాటు
- ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు శిక్ష వేస్తామన్న బీఆర్ఎస్ నేత
"కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసింది. అక్రమ కేసులు పెట్టి మా ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తోంది. వందల మంది పోలీసులు వెళ్లి తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ విషయాన్నిపోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ఏదో ఒకవిధంగా జైలుకు పంపాలని చూస్తున్నారు. అధికార పార్టీ నేతలకు అక్కడ క్రషర్లు ఉన్నాయి. వాటికి అనుమతులు లేకపోయినా నడుస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో మేం దాడులు చేస్తున్నామని స్వయంగా ఆర్‌డీఓ చెప్పారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు శిక్ష వేస్తాం" అని హరీశ్‌రావు చెప్పారు.