అలాంటి పరిస్థితుల్లో విడిపోవడమే బెటర్: నటి రోహిణి 
Add ap7am to your home Screen

అలాంటి పరిస్థితుల్లో విడిపోవడమే బెటర్: నటి రోహిణి

Rohini Interview
  • నటిగా .. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణించిన రోహిణి 
  • గతంలో రఘువరన్ నుంచి విడిపోయిన నటి  
  • విడాకుల విషయంలో ఇప్పటి ఆలోచనా విధానం మారిందని వ్యాఖ్య 
  • పేరెంట్స్ విడాకుల వలన పిల్లలు ఎఫెక్టు అవుతారని వెల్లడి 
  • విడిపోవడానికి ముందు బేరీజు వేసుకోవలసింది ఇదేనని వివరణ  

బాలనటిగా ఇండస్ట్రీకి వచ్చిన రోహిణి, ఆ తరువాత కథానాయికగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా .. డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. రఘువరన్ ను వివాహం చేసుకున్న కొంతకాలానికి ఆమె ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో రోహిణి మాట్లాడుతూ, విడాకుల గురించి ప్రస్తావించారు. 

"ఒక కప్పు క్రింద జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అభిప్రాయభేదాలు వస్తూనే ఉంటాయి. అప్పట్లో పిల్లల కోసం .. సమాజం కోసం .. డబ్బు కోసం జీవితంతో రాజీపడుతూ వెళ్లడం జరుగుతూ వచ్చింది. పెద్దవాళ్లు కూడా, అమ్మాయే సర్దుకుపోవాలి .. అప్పుడే సంసారం సాగుతుందని అనేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని దాటిపోయామని నేను అనుకుంటున్నాను" అన్నారు. 

"విడిపోవడం వలన ఏదో అయిపోతుందని చాలామంది అనుకుంటారు .. కానీ ఏమీ కాదు. తల్లిదండ్రులు విడిపోవడం వలన పిల్లలు చాలానే ఎఫెక్ట్ అవుతారు. అయితే కలిసుండటం వలన వాళ్ల భవిష్యత్తు ఎక్కువగా డ్యామేజ్ అవుతుందా? విడిపోవడం వలన ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? అనేది బేరీజు వేసుకోవాలి. దానిని బట్టే నిర్ణయాన్ని తీసుకోవాలి" అని చెప్పారు. 
Advertisement
Rohini
Actress
Tollywood

More Telugu News