ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసుల మృతి
- హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న కారు
- నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకున్న ప్రమాదం
- తిరుమల వెళ్లి వస్తూ హైదరాబాదీల మృత్యువాత
మృతులంతా సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు. కుటుంబ పెద్ద రవీందర్‌తో పాటు అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్‌కిరణ్ అక్కడికక్కడే మృతి చెందారని వెల్లడించారు. కాగా ఫిబ్రవరి 29న బాల కిరణ్, కావ్యలకు వివాహం జరిగింది.