మార్చి 2న వ్యూహం సినిమా విడుదల.. ఆర్జీవీ ట్వీట్

VYOOHAM in theatres MARCH 2nd Says RGV
  • సెన్సార్ సర్టిఫికెట్ చూపిస్తూ ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ
  • పట్టువదలని విక్రమార్కుడిని అంటున్న ఆర్జీవీ
  • ఎట్టకేలకు థియేటర్లకు రానున్న వ్యూహం సినిమా
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘వ్యూహం’ విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది. వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి 2న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఆర్జీవీ ఓ ట్వీట్ లో వెల్లడించారు. కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను చూపిస్తూ.. ‘పట్టు వదలని విక్రమార్కుడిని’ అంటూ ట్వీట్ చేశారు. మార్చి 2న వ్యూహం సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సినిమాను ఆది నుంచీ వివాదాలు చుట్టుముట్టాయి.

వైఎస్సార్ మరణానంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహం సినిమాను ఆర్జీవీ తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాపై టీడీపీ, జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జగన్ పొలిటికల్ మైలేజీ కోసం తమ నాయకులను కించపరిచేలా చూపించాడంటూ ఆర్జీవీపై మండిపడుతున్నాయి. ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని పలువురు టీడీపీ నేతలు కోర్టుకెక్కారు. దీంతో గతేడాది డిసెంబర్ 29 న విడుదల కావాల్సిన సినిమా రెండు నెలల తర్వాత థియేటర్లలోకి రానుంది. కోర్టు ఆదేశాలతో విడుదలను పదే పదే వాయిదా వేసిన ఆర్జీవీ.. పట్టు వదలకుండా పోరాడి వ్యూహం విడుదలకు అనుమతి తెచ్చుకున్నానని చెప్పారు.
Advertisement
RGV Vyooham
Vyooham Release
Movie
jagan bio pic
Censor certificate

More Telugu News