తెలంగాణలో పలువురు ఐఏఎస్ ల బదిలీ

IAS officers transfers in Telangana
  • నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా జీవన్ పాటిల్
  • సిద్దిపేట కలెక్టర్ గా మను చౌదరి
  • రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ కు అదనపు బాధ్యతలు
పలువురు ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న ప్రశాంత్ జీవన్ పాటిల్ నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. సిద్దిపేట కలెక్టర్ గా మిక్కిలినేని మను చౌదరిని నియమించారు. మను చౌదరి ప్రస్తుతం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్నారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాను జనగాం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్ కు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను అదనపు హోదాలో చూస్తున్న సునీల్ శర్మను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.
Go Back to Shorts
IAS
Transfers
Telangana

More Telugu News