తనయుడితో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన ఎంపీ రఘురామకృష్ణరాజు
- చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం
- స్వయంగా చిరంజీవిని అభినందించిన రఘురామ
- ఎక్స్ లో ఫొటోలు పంచుకున్న వైనం
దీనిపై రఘురామకృష్ణరాజు ఎక్స్ ద్వారా వెల్లడించారు. భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపికైన ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపాను అని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా చిరంజీవి పంచుకున్నారు.
