పోలీస్ ఆఫీసర్ గా కీర్తి సురేశ్ .. 'సైరన్' రిలీజ్ డేట్ ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీస్ ఆఫీసర్ గా కీర్తి సురేశ్ .. 'సైరన్' రిలీజ్ డేట్ ఇదే!

Siren movie update
  • జయం రవి హీరోగా రూపొందిన 'సైరన్'
  • ఆయన సరసన నాయికగా కీర్తి సురేశ్ 
  • ముఖ్యమైన పాత్రలో అనుపమ పరమేశ్వరన్ 
  • ఈ నెల 23వ తేదీన సినిమా విడుదల

'తని ఒరువన్' .. 'కొమాలి' .. 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి. తాజాగా 'సైరన్' అనే మాస్ ఎంటర్టయినర్ తో రానున్నారు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఆంథోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'గంగ ఎంటర్టైన్మెంట్స్' పతాకంపై ఈ నెల 23న విడుదల చేయనున్నారు.

చిత్ర నిర్మాత సుజాత విజయకుమార్ మాట్లాడుతూ " 'సైరన్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ కుదిరేలా తెరకెక్కించాం. జయం రవి గారు మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నారు. కీర్తి, అనుపమ మొదటి సారి ఆయనతో కలిసి నటించారు. ఫిబ్రవరి 23న తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అన్నారు.

నటుడు సముద్రఖని మాట్లాడుతూ "జయం రవి చాలా ప్రతిభ గల నటుడు. ఇంకో వంద చిత్రాలైనా చేయగల నేర్పు అతనిలో ఉంది. మేము ఇదివరకే కలిసి నటించాం. ఈ చిత్రంలో మా పాత్రలు అద్భుతంగా వచ్చాయి" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ మాట్లాడుతూ " ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం, అదీ పెద్ద హీరోతో అయినప్పుడు, కచ్చితంగా హిట్ అవ్వాలనుకుంటారు.  ఆ బాధ్యత జయం రవి గారు తీసుకున్నారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని చెప్పారు. 

హీరో జయం రవి మాట్లాడుతూ "ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. వాటికి జి.వి తన సంగీతం తో ప్రాణం పోశాడు. ఈ చిత్రంలో ముఖ్యమైన లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రకి కీర్తి బాగుంటుంది అనుకున్నాము, మా నమ్మకాన్ని తను పూర్తిగా నిలబెట్టింది. ఆంథోనీ భాగ్యరాజ్ రానున్న కాలంలో చాలా ఎత్తుకు ఎదగడం ఖాయం. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. తమిళ - తెలుగు ప్రేక్షకులని ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందనే నమ్మకం పూర్తిగా ఉంది" అన్నారు.
Advertisement
Siren
Jayam Ravi
Keerthi Suresh
Anupama

More Telugu News