సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ కు బాంబు బెదిరింపు

Threat Call To Alfa Hotel
  • శనివారం రాత్రి బెదిరింపు ఫోన్ కాల్.. అప్రమత్తమైన పోలీసులు
  • వెంటనే హోటల్ కు చేరుకుని తనిఖీలు
  • అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని వెల్లడి
సికింద్రాబాద్ లోని ప్రముఖ హోటల్ ఆల్ఫాలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. శనివారం రాత్రి 10:45 ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆల్ఫా హోటల్ కు చేరుకున్నారు. కస్టమర్లను, సిబ్బందిని బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి దాదాపు రెండు గంటల పాటు క్షుణ్ణంగా శోధించారు. అయితే, ఈ తనిఖీలలో అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదని పోలీసులు చెప్పారు. హోటల్ లో ఎలాంటి పేలుడు పదార్థం లేదని, ఎవరో ఆకతాయితనంతో ఫోన్ చేసి ఉంటారని చెప్పారు. ఫోన్ చేసింది ఎవరని దర్యాఫ్తు చేయగా.. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అని తేలింది. నిందితుడికి సంబంధించి పూర్తి వివరాలపై ఇంకా ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Go Back to Shorts
Alfa Hotel
Threat call
Bomb Threat
Secunderabad
Railway Station
Crime News

More Telugu News