హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చిన చిరంజీవి
- రేపు విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమం
- యండమూరి వీరేంద్రనాథ్ కు సాహితీ పురస్కారం
- ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, తమ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారని వెల్లడించారు. సభాధ్యక్షుడిగా హైకోర్టు జడ్జి జస్టిస్ ఆకుల శేషసాయి వ్యవహరిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు సాహితీ పురస్కారం ప్రదానం చేస్తామని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు.