Mohammad Siraj: 92 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన పేసర్ మహ్మద్ సిరాజ్

Pacer Mohammad Siraj broke the 92 year old record with 6 wickets
షార్ట్స్‌లో చూడండి
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో సంచలనం సృష్టించిన పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డును సృష్టించాడు. లంచ్ విరామానికి ముందు 5 వికెట్లు తీసిన మొట్టమొదటి భారతీయ పేసర్‌గా నిలిచాడు. 92 ఏళ్ల ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒక పేసర్ లంచ్ బ్రేక్‌కు ముందు 5 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. 

అయితే, సిరాజ్‌కు ముందు ఎడమచేతి వాటం స్పిన్నర్ మణీందర్ సింగ్ మాత్రమే ఈ రికార్డును సాధించాడు. 1986-1987లో బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌పై టెస్టులో ఈ ఘనత సాధించాడు. దీంతో లంచ్‌కు ముందు ఐదు వికెట్లు తీసిన పేసర్‌గా సిరాజ్, స్పిన్నర్‌గా మణీందర్ సింగ్ నిలిచారు. కాగా బుధవారం దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడు. పేస్, స్వింగ్, సీమ్ బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా కేవలం 23.2 ఓవర్లలోనే 55 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

1991లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి సౌతాఫ్రికా తిరిగి ప్రవేశించిన తర్వాత ఆ జట్టు టెస్టు క్రికెట్‌లో ఇదే అత్యల్ప స్కోరుగా ఉంది. ఇండియాపై టెస్టుల్లో ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోరుగా ఉంది. అంతకుముందు 2021లో ముంబై టెస్టులో న్యూజిలాండ్ 62 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టుల్లో ప్రత్యర్థిని టీమిండియా 60 పరుగుల్లోపే ఆలౌట్ చేయడం 1932 తర్వాత ఇదే తొలిసారి. 1932లో తొలి టెస్టు ఆడిన భారత్ ప్రత్యర్థిని 60 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ చేసింది.
Go Back to Shorts
Mohammad Siraj
India vs South africa
Cricket
Team India

More Telugu News