హైదరాబాద్ అంటే చార్మినార్.. ట్యాంక్‌బండ్... నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకు వస్తాయి: రేవంత్ రెడ్డి
- నుమాయిష్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- నుమాయిష్ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తామని హామీ
- పారిశ్రామిక రంగంలో మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని హామీ
కొన్నేళ్లుగా పలువురు పారిశ్రామికవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్లు, వివిధ సంస్థలు కలిసి నుమాయిష్‌ను విజయవంతంగా.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నుమాయిష్ తెలంగాణకే గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యాసంస్థల్లో 30వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు తెలిపారు. దశాబ్దాలుగా ఎంతోమంది వ్యాపారవేత్తలను తయారు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారని... రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పులు తీసుకు వస్తామన్నారు.