ఐపీఎల్ కూ దూరం కానున్న హార్దిక్ పాండ్యా!
- గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో నిర్ణయం
- ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పాండ్యా
- ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ ఆడడంలేదని ఇప్పటికే ప్రకటన
గాయం నుంచి పాండ్యా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ కు కూడా దూరమయ్యాడు. ఈ విషయంపై ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదలైంది. ఈసారి ఐపీఎల్ సీజన్ లో పాండ్యా పాల్గొంటాడా లేదా అనే విషయంపై కొన్ని రోజులుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై దాదాపుగా క్లారిటీ వచ్చేసిందని, ఐపీఎల్ కు దూరంగా ఉండాలని పాండ్యా నిర్ణయించుకున్నాడని అనధికారిక సమాచారం.