ప్రస్తుత ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడూ నాకు గౌరవం ఇవ్వలేదు: రసమయి బాలకిషన్
- మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై రసమయి ఆగ్రహం
- మొన్న జరిగిన ఎన్నికల్లో దొంగమాటలు చెప్పి కవ్వంపల్లి గెలిచారని ఆరోపణ
- ఎమ్మెల్యే మాట తీరు మార్చుకోవాలని సూచన
ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ... మొన్న జరిగిన ఎన్నికల్లో దొంగమాటలు చెప్పి కవ్వంపల్లి గెలిచారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కవ్వంపల్లి బ్రోథల్ హౌస్ నడిపి డబ్బులు సంపాదించారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన మాట తీరు మార్చుకోవాలని సూచించారు. లేదంటే తానూ ఆయన దారిలోకే రావాల్సి ఉంటుందన్నారు. ఇకపై ఆయన ఏమి మాట్లాడితే తానూ అవే మాట్లాడుతానని స్పష్టం చేశారు.