బతుకమ్మ చీరల బకాయిలు రూ. 200 కోట్లు.. రేవంత్ ప్రభుత్వంపై నేతన్నల ఆశలు
- బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసిన గత ప్రభుత్వం
- నూలు సబ్సిడీ కూడా చెల్లించని వైనం
- వచ్చే ఏడాది ఆర్డర్ కూడా తమకే ఇవ్వాలంటున్న సిరిసిల్ల నేత కార్మికులు
అంతేకాదు, వచ్చే ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంతోపాటు వచ్చే ఏడాది చీరల ఆర్డర్ కూడా తమకే ఇవ్వాలని కోరుతున్నారు. స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు కూడా గత ప్రభుత్వం తమకే ఇచ్చిందని, ఈసారీ తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.