గీతామాధురితో డైవర్స్ వార్తలపై స్పందించిన నందు!
Add ap7am to your home Screen

గీతామాధురితో డైవర్స్ వార్తలపై స్పందించిన నందు!

Nandu Interview
  • 'వధువు' ప్రమోషన్స్ లో నందు 
  • గీతామాధురి గురించిన ప్రస్తావన 
  • తను మంచి హోమ్ మేకర్ అని వెల్లడి 
  • తమ విడాకులపై జరిగింది ప్రచారం మాత్రమేనని వ్యాఖ్య  

గీతామాధురి భర్త నందు .. ప్రస్తుతం ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నాడు. 'మాన్షన్ 24' వెబ్ సిరీస్ లో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన ఆయన, రీసెంటుగా వచ్చిన 'వధువు' వెబ్ సిరీస్ లోను ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఈ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో ఆయన కనిపిస్తున్నాడు. 

తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందు మాట్లాడుతూ .. "గీత .. నా తలరాతను మార్చేసింది. ఆమె మంచి హోమ్ మేకర్. నాకు సంబంధించిన అన్ని వ్యవహారాలను దాదాపు తనే చూసుకుంటుంది. ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను తాను చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. కాకపోతే తన మేకప్ సామగ్రికి సంబంధించిన విషయంలో తనని కంట్రోల్ చేయడమే చాలా కష్టం" అని అన్నాడు. 

"గీతా .. నేను చాలా ప్రేమగా ఉంటాము. అయితే ప్రొఫెషన్ పరంగా ఎవరి గుర్తింపు వారికి రావాలనే ఉద్దేశంతో, కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం మానేశాము. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా తగ్గిస్తూ వచ్చాము. దాంతో ఈ ఇద్దరూ విడిపోతున్నారు .. అందుకే ఇలా" అంటూ ప్రచారం చేయడం మొదలెట్టారు. నిజానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము" అని చెప్పాడు.
Advertisement
Geetha Madhuri
Nandu
Vadhuvu

More Telugu News