యూపీలో విషాదం.. టైరు పేలడంతో ట్రక్కును ఢీకొట్టిన కారు.. చిన్నారి సహా 8 మంది సజీవ దహనం
- ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జాతీయ రహదారిపై ఘటన
- పెళ్లికి వెళ్లి వస్తుండగా పేలిన కారు టైరు
- అదుపుతప్పి పక్క రోడ్డులో వస్తున్న ట్రక్కును ఢీకొట్టిన కారు
- కారు డోర్లు లాక్ కావడంతో తప్పించుకునే మార్గం లేక మంటలకు ఆహుతి
కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి అవతిలి రోడ్డులో ఉత్తరాఖండ్ నుంచి ఇసుకతో వస్తున్న ట్రక్కును ఢీకొట్టి నుజ్జునుజ్జు అయింది. కారును ట్రక్కు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. కారు డోర్లు లాక్ కావడంతో లోపల ఉన్నవారు తప్పించుకోలేకపోయారు. మంటల్లో అందరూ సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నుంచి చిన్నారి సహా ఏడుగురి మృతదేహాలను బయటకు తీశారు. బాధితులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.