Hidden Camera: ప్రియుడు చెప్పాడని యువతి దురాగతం.. లేడీస్ బాత్రూంలో రహస్య కెమెరా ఏర్పాటు

woman puts hidden camera in ladies bathroom on instruction from her lover
  • చండీఘడ్‌లోని లేడీస్ హాస్టల్‌లో వెలుగు చూసిన ఘటన
  • ఎవరికీ అనుమానం రాకుండా యువతుల వీడియోల చిత్రీకరణ
  • ఓ యువతి కంట రహస్య కెమెరా పడటంతో నిందితుల బండారం బట్టబయలు
  • పోలీసుల అదుపులో నిందితులు

చండీఘడ్‌కు చెందిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి కోరిక మేరకు లేడీస్ హాస్టల్‌లోని బాత్‌రూంలో వెబ్ కెమెరాను అమర్చింది. రహస్య కెమెరా ద్వారా యువతుల వీడియోలను వారు రికార్డు చేసేవారు. అయితే, ఈ కెమెరాను ఓ యువతి గుర్తించి హాస్టల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చింది. నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెబ్ కెమెరా అమర్చిన యువతి, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న కెమెరా, మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

  • Loading...

More Telugu News