నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కీలక సమావేశం

Chandrababu to hold TDP Parliamentary party meeting today
  • సాయంత్రం టీటీడీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
  • వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే అంశంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన తిరుమల నుంచి అమరావతిలోని తన నివాసానికి బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్లమెంట్ వేదికగా వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే విషయంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. 

ఈ నెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. రేపు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. వాస్తవానికి ఈ సమావేశం 3వ తేదీన నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే, 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో సమావేశాన్ని ఒక రోజు ముందుకు జరిపారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Tirumala
Parliamentary Party

More Telugu News