తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతలు ఈరోజు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నారంటే..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతలు ఈరోజు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నారంటే..!

Telangana election campaigning ends today
  • సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం
  • హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహించనున్న రాహుల్
  • వరంగల్, గజ్వేల్ లో పర్యటించనున్న కేసీఆర్
ఈ రోజుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. గత కొన్ని రోజులుగా హోరెత్తించిన ప్రచారాలు ఆగిపోనున్నాయి. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు ప్రచారానికి చివరి రోజైన నేడు అన్ని ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 

ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నారంటే:

  • రాహుల్ గాంధీ - హైదరాబాద్ జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగులు
  • ప్రియాంకాగాంధీ - జహీరాబాద్
  • రేవంత్ రెడ్డి - కామారెడ్డి, దోమకొండ, బీబీపేట్
  • కేసీఆర్ - వరంగల్, గజ్వేల్
  • హరీశ్ రావు - సిద్ధిపేట, చేగుంట
  • పవన్ కల్యాణ్ - బాలానగర్ క్రాస్ రోడ్స్ నుంచి హస్మత్ పేట్ వరకు రోడ్ షో
  • దేవేంద్ర ఫడ్నవిస్ - దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేట
  • ఏక్ నాథ్ షిండే - ఆదిలాబాద్, ధర్మపురి.
Advertisement
Telangana Elections
Campaigning
Rahul Gandhi
Priyanka Gandhi
KCR
Harish Rao

More Telugu News