'యానిమల్' ఈవెంటులో మహేశ్ బాబు పాటకి స్టెప్పులేసిన అనిల్ కపూర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'యానిమల్' ఈవెంటులో మహేశ్ బాబు పాటకి స్టెప్పులేసిన అనిల్ కపూర్!

Animal Pre Release Event
  • 'యానిమల్'లో ముఖ్యమైన రోల్ చేసిన అనిల్ కపూర్ 
  • మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • తెలుగులో మాట్లాడిన అనిల్ కపూర్ 
  • మహేశ్ బాబు పాటకి స్టేజ్ పై స్టెప్పులు

రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' సినిమాను రూపొందించాడు. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో, రణ్ బీర్ జోడీగా రష్మిక కనిపించనుంది. డీసెంబర్ 1వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదు .. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు. 

రాజమౌళి - మహేశ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరైన ఈవెంటులో అనిల్ కపూర్ తెలుగులో మాట్లాడటం విశేషం. "అందరూ బాగున్నారా .. ట్రైలర్ నచ్చిందా .. ఒక యాక్టర్ గా నాకు బర్త్ ను ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ. 1980లో నేను బాపుగారి దర్శకత్వంలో 'వంశవృక్షం' సినిమాలో నటించాను. లేట్ గా వచ్చినా లేటెస్టుగా మీ ముందుకు వచ్చాను. నిజంగా ఇది నాకు స్పెషల్ ఫీలింగ్" అని అన్నారు. 

"దర్శకుడు సందీప్ వంగా చాలా బ్రిలియంట్. 43 ఏళ్ల తరువాత తెలుగులో విడుదలవుతున్న నా సెకండ్ సినిమాగా నేను భావిస్తున్నాను. మహేశ్ బాబు లాంటి ఫ్యామిలీ మేన్ .. రాజమౌళి వంటి సూపర్ డైరెక్టర్ ఈ ఫంక్షన్ కి రావడం ఆనందంగా ఉంది" అని అన్నారు. మహేశ్ బాబు పాటకి డాన్స్ చేస్తానని అంటూ ఆయనని స్టేజ్ పైకి రమ్మంటూ పట్టుపట్టారు. కాదనలేక మహేశ్ బాబు స్టేజ్ పైకి వచ్చాడు. అనిల్ కపూర్ మాత్రం హుషారుగా స్టెప్పులేశారు. 

Advertisement
Ranbir Kapoor
Rashmika Mandanna
Anil kapoor

More Telugu News