Road Accident: నల్గొండ జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

Private travel bus overturned in Nalgonda district
షార్ట్స్‌లో చూడండి
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మాచర్ల వెళ్తున్న వోల్వో బస్సు చింతపల్లి శివారులో బోల్తా పడింది. చింతపల్లి వద్ద నాగార్జునసాగర్‌ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. పది మంది ప్యాసింజర్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలావుండగా రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు రక్తమోడుతున్నాయి. అతివేగంతోపాటు ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
Go Back to Shorts
Road Accident
Bus Accident
Nalgonda District
Hyderabad
Telangana

More Telugu News