G. Kishan Reddy: తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందన్న చిదంబరం వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

Kishan reddy counter to chidambaram comments
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని, ప్రజలు తీవ్రంగా ఉద్యమించి ఆ పార్టీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారన్నారు. చాలామంది ఉద్యమకారుల బలిదానంతో తెలంగాణ ఏర్పడిందన్నారు. ఎంతోమంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ అన్ని విధాలా అన్యాయం చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. శుక్రవారం నాంపల్లిలో బీజేపీ అభ్యర్థి రాహుల్ చంద్రకు మద్దతుగా కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
Go Back to Shorts
G. Kishan Reddy
BJP
Congress
Chidambaram
Telangana Assembly Election

More Telugu News