కాశీలో గంగాహారతికి హాజరైన బాలీవుడ్ నటి సన్నీలియోన్.. సంప్రదాయ దుస్తుల్లో చూసి అభిమానుల ఫిదా!
- సంప్రదాయ దుస్తులు, మెడలో దండతో కార్యక్రమానికి హాజరు
- సహనటుడు అభిషేక్ సింగ్‌తో కలిసి పాల్గొన్న సన్నీలియోన్
- మ్యూజిక్ వీడియో ‘థర్డ్ పార్టీ’ని బుధవారం విడుదల చేసిన సన్నీ
సంప్రదాయ పింక్ డ్రెస్, మెడలో దండతో కార్యక్రమానికి హాజరైన ఆమె పండితులు పూజలు చేస్తుంటే ముకుళిత హస్తాలతో నిల్చున్నారు. ఆమెతోపాటు నటుడు అభిషేక్ కూడా ఉన్నారు. సన్నీని చూసేందుకు జనం ఎగబడ్డారు. సన్నీలియోన్, అభిషేక్ సింగ్ కలిసి చేసిన ‘థర్డ్ పార్టీ’ మ్యూజిక్ వీడియోను బుధవారం విడుదల చేశారు. ఈ పాటను అభిషేక్ సింగ్ రాసి, పాడడమే కాకుండా కంపోజ్ చేశాడు.