Anand Mahindra: తనలాగే ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra surprised after seeing lookalike of him
షార్ట్స్‌లో చూడండి
మనిషిని పోలిన మనుషులు ఉండడం సహజమే. తాజాగా, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అచ్చం తనలాగే ఉన్న వ్యక్తి ఫొటోని చూసి ఆశ్చర్యపోయారు. ఓ నెటిజన్ ఆనంద్ మహీంద్రాలా ఉన్న వ్యక్తి  ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అతడు నా కొలీగ్ అని ఆ వ్యక్తి తెలిపారు. ఆ పోస్టుకు ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశారు. 

దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. అంతేకాదు, తనదైన శైలిలో ఆ ఫొటోపై వ్యాఖ్యానించారు. "చూస్తుంటే మేం ఎప్పుడో విడిపోయినట్టున్నాం. బహుశా మా చిన్నతనంలో ఏదో తిరునాళ్లలో తప్పిపోయి ఉంటాం" అని చమత్కరించారు. కాగా, ఈ ఫొటోపై నెటిజన్లు కూడా తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
Go Back to Shorts
Anand Mahindra
Lookalike
Social Media
India

More Telugu News