ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేసిన షాకింగ్ వీడియో వైరల్
- గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం
- ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన వైనం
- బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి, అతడి కుమార్తె మృతి, భార్యకు తీవ్ర గాయాలు
- అతివేగమే ఈ అనర్థానికి కారణమన్న సజ్జనార్
ఆనంద్ ప్రాంతంలో ఓ కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో అతివేగంగా వెళుతూ ఎదురుగా బైక్‌పై వస్తున్న ఓ కుటుంబాన్ని డీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న భార్యాభర్తలు వారి ఐదేళ్ల కుమార్తె ఒక్కసారిగా గాల్లో ఎగిరిపడ్డారు. తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా, తల్లికి తీవ్ర గాయాలయ్యాయని సజ్జనార్ తెలిపారు. అతివేగం తెచ్చిన అనర్థం ఇదంటూ విచారం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.