ప్రపంచకప్‌కు దూరం కావడంపై ఆవేదనగా స్పందించిన హార్దిక్ పాండ్యా
- బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన పాండ్యా
- జట్టుకు దూరమైన విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్న ఆల్‌రౌండర్
- అయినా జట్టుతోనే ఉంటానన్న పాండ్యా
పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ పాండ్యా గాయపడ్డాడు. ఎడమ చీలమండకు గాయం కావడంతో ఆ ఓవర్ ముగించకుండానే మైదానం వీడాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగలేదు. తాజాగా, అతడి గాయంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ ప్రపంచకప్‌లోని మిగతా మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడం లేదని పేర్కొంది. కాగా, పాండ్యా స్థానంలో యువ పేసర్ ప్రసీద్ కృష్ణకు చోటు లభించింది.