43 మందితో రెండో జాబితాను విడుదల చేసిన బీఎస్పీ

43 మందితో రెండో జాబితాను విడుదల చేసిన బీఎస్పీ

BSP releases second list
  • 26 మంది బీసీలు, ఏడుగురు ఎస్టీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు ఓసీలకు టిక్కెట్
  • వరంగల్ ఈస్ట్ టిక్కెట్ ట్రాన్స్ జెండర్‌కు కేటాయింపు
  • సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ టిక్కెట్‌ను బీఎస్పీ పార్టీ ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఇచ్చింది. కొన్నిరోజుల క్రితం 20 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ... తాజాగా మరో 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన 43 మందిలో 26 మంది బీసీలకు, ఏడుగురు ఎస్టీలకు, ఆరుగురు ఎస్సీలకు, ముగ్గురు ఓసీలకు టిక్కెట్లు కేటాయించింది. వరంగల్ ఈస్ట్ టిక్కెట్ ట్రాన్స్ జెండర్‌కు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
Advertisement
bsp
Telangana
Telangana Assembly Election

More Telugu News