రైతన్నా... ఈ రెండింట్లో ఏది కావాలో ఆలోచించు: మంత్రి కేటీఆర్ ట్వీట్
- తెలంగాణలో కేసీఆర్, కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తోన్న పథకాలను బేరీజు వేసుకోవాలని సూచన
- కేసీఆర్ ఇస్తోన్న 24 గంటల విద్యుత్ కావాలా? కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తోన్న 5 గంటల విద్యుత్ కావాలా? అని ప్రశ్న
- అరవై ఏళ్లు ఆగం చేసినవారు కావాలా? నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కావాలా? అని కేటీఆర్ ట్వీట్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న 24 గంటల విద్యుత్ కావాలా? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోన్న 5 గంటల విద్యుత్ తీసుకుంటారా? లేక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన మూడు గంటల విద్యుత్ కావాలా? రైతుబంధు, రైతుబీమా ఇచ్చి ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ కావాలా? అరవై ఏళ్లు ఆగం చేసిన వారు మీకు కావాలా? నెర్రలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కావాలా? ఏది కావాలి మనకు? ఆలోచించు రైతన్నా.... అని పేర్కొన్నారు.