రెండో తరగతి బాలికపై యాసిడ్ విసిరిన ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్‌పై వేటు
- కర్ణాటకలోని జోడిచిక్కనహళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఘటన
- తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రిలో చేర్చిన ఉపాధ్యాయుడు
- ఉద్దేశపూర్వకంగా ఆ పనిచేయలేదన్న నిందితుడు
యాసిడ్‌తోపాటు అందులోని ఓ ప్యాకెట్‌లో ఉన్న పౌడర్ పడి బాలిక తీవ్రంగా గాయపడింది. అప్రమత్తమైన హెడ్మాస్టర్ రంగస్వామి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు రంగస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై రంగస్వామి మాట్లాడుతూ.. తాను ఉద్దేశపూర్వకంగా ఆమెపై యాసిడ్ విసరలేదని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.