పాండ్యా స్థానంలో ఆడించబోయే ఆటగాడిపై హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్ ! తుది జట్టుపై క్లారిటీ ఉందని వ్యాఖ్య
- రెండు, మూడు ఆప్షన్లు ఉన్నాయన్న ద్రావిడ్
- ఆల్‌రౌండర్‌గా ఉండడమే శార్ధూల్ ఠాకూర్ పాత్ర అని వ్యాఖ్య
- న్యూజిలాండ్‌పై పాండ్యా స్థానంలో ఠాకూర్‌ను ఆడించొచ్చని అంచనాలు
హార్ధిక్ పాండ్యా సహజంగానే జట్టుకు కీలకమైన ఆటగాడని, అతడి స్థానాన్ని భర్తీ చేసే విషయంలో జట్టు సమతుల్యత పాటిస్తామన్నాడు. ఉత్తమ ఎంపిక ఉంటుందని అన్నాడు. మొదటి నాలుగు మ్యాచ్‌ల మాదిరిగా జట్టు అంత సమతూకంగా ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు. శార్ధూల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకోనివచ్చే అభిప్రాయాలు కలిగేలా ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో బౌలింగ్ ఆల్‌రౌండర్ కలిగివుండడమే శార్ధూల్ ఠాకూర్ పాత్ర అని, అతడు నాణ్యమైన ఆటగాడని వ్యాఖ్యానించాడు. ఇక షమీతోపాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు కూడా నాణ్యమైన ఆటగాళ్లని విశ్లేషించాడు. దీంతో తుది జట్టుపై క్లారిటీ ఇవ్వకపోయినా శార్థూల్ ఠాకూర్ వైపు మొగ్గుచూపొచ్చని సంకేతాలు ఇచ్చినట్టయ్యింది.