ఫోన్ కావాలా బేబీ.. ఈ కండిషన్‌కు ఒప్పుకో మరి.. నటి ఊర్వశికి షాకిచ్చిన చోరుడు!

Bollywood Actress Urvashi RaButela Shares Mail From Person Who Stole Her 24 Carat Gold iPhone
  • తన సోదరుడి కేన్సర్ చికిత్సకు సాయం చేస్తే ఫోన్ తిరిగి ఇస్తానని కండిషన్
  • స్క్రీన్‌షాట్ షేర్ చేసిన ఊర్వశి రౌతేలా
  • భారత్-పాక్ మ్యాచ్‌లో ‘బంగారు ఐఫోన్’ను పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా అత్యంత విలువైన ఐఫోన్‌ను కొట్టేసిన చోరుడు తిరిగి ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అయితే, అందుకు పెద్ద కండిషనే పెట్టాడు. ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి ఈ నెల 16న ఈ బాలీవుడ్ భామకు ఈమెయిల్ చేస్తూ.. ‘‘ఆ ఫోన్ నా దగ్గరే ఉంది. అది మీకు కావాలంటే నాకో సాయం చేయాలి. నా సోదరుడు కేన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడు కేన్సర్ నుంచి కోలుకునేందుకు మీరు సాయం చేయాలి’’ అని అభ్యర్థించాడు. దీనిని ఆమె స్క్రీన్‌షాట్ తీసి తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంది.

ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు ఊర్వశి హాజరయ్యారు. ఈ క్రమంలో 24 కేరెట్ల బంగారు తాపడంతో చేసిన ఖరీదైన ఐఫోన్‌ను పొగొట్టుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. దొరికినవారు తన ఫోన్‌ను తిరిగి ఇవ్వాలని వేడుకున్నారు. ఇప్పుడు ఫోన్ తన వద్ద ఉందంటూ ఓ వ్యక్తి చేసిన పోస్టుతో ఆమె సంతోషంగా ఉన్నప్పటికీ, సదరు వ్యక్తి సోదరుడి కేన్సర్ చికిత్సకు సాయం చేస్తుందా? లేదా? అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
Advertisement
Urvashi Rautela
Bollywood
Gold iPhone

More Telugu News