ఆ టెక్కీ రూ.3 కోట్ల ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు... ఎందుకంటే..!
- మాజీ మెటా ఉద్యోగి రూ.3 కోట్ల ఉద్యోగాన్ని వదులుకున్న వైనం
- పని చేస్తోన్న సమయంలో పానిక్ అటాక్స్ రావడంతో వర్క్ నుంచి డిస్‌కనెక్ట్ కాకపోయినట్లు వెల్లడి
- పలుమార్లు పానిక్ అటాక్ రావడంతో ఉద్యోగం వదిలేసినట్లు స్పష్టీకరణ
తన పని సంక్లిష్టమైనదని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నాడు. ఆ తర్వాత కూడా పని నుంచి డిస్‌కనెక్ట్ కాలేకపోయినట్లు చెప్పాడు. వీకెండ్స్‌లో పలుమార్లు పని చేసినా తన పనిని బాస్‌లు విమర్శించేవారన్నాడు. దీంతో ఆఫీస్‌లోనే తనకు పానిక్ అటాక్స్ వచ్చాయని, మూడేళ్ల క్రితం నవంబర్‌లో కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో తొలిసారిగా పానిక్ అటాక్ వచ్చిందన్నాడు. ఇలా పలుమార్లు జరగడంతో రూ.3 కోట్ల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని వదులుకున్నట్లు చెప్పాడు. రియల్ ఎస్టేట్‌లో పని చేస్తున్నానని చెప్పాడు.