ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాపై 6 వేల బాంబులు కురిపించిన ఇజ్రాయెల్
- ఏడో రోజుకు చేరుకున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం
- ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌లో 1300 మంది, గాజాలో 1500 మంది మృతి
- ప్రాణాలు కోల్పోయిన 27 మంది అమెరికన్ పౌరులు
- తమ పౌరుల కోసం చార్టర్ విమానాలను సిద్ధం చేస్తున్న అమెరికా
- ఇప్పటికే ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించిన భారత్
ఇరు దేశాల మధ్య యుద్ధం రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా చార్టర్ విమానాలను సిద్ధం చేస్తోంది. పాలస్తీనా మిలిటెంట్ల దాడిలో ఇప్పటి వరకు 27 మంది అమెరికన్లు మరణించారు. మరో 14 మంది జాడ కనిపించడం లేదు. ఇండియా కూడా తమ పౌరులను తరలించేందుకు ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజాపై 6 వేల బాంబులు వేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.