హ్యాపీ బర్త్ డే జక్కన్న.. అంటూ ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

Jr NTR conveys birthday wishes to Rajamouli
  • రాజమౌళితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన ఎన్టీఆర్  
  • స్టూడెంట్ నెం.1 నుంచి ఇద్దరి స్నేహం
  • సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ కు స్టార్ డం కట్టబెట్టిన స్టార్ డైరెక్టర్ 
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే జక్కన్న.. అంటూ ట్వీట్ చేశారు. షూటింగ్ స్పాట్ లో రాజమౌళితో కలిసి ఉన్న ఫొటోను జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్ కు జతచేశారు. కాగా, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. స్టూడెంట్ నెం.1 సినిమాతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. ఆపై సింహాద్రి సినిమాతో జూనియర్ కు తిరుగులేని స్టార్ డం రావడానికి జక్కన్న దర్శకత్వ ప్రతిభ కూడా ఓ కారణమే.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. యమదొంగ చిత్రం కోసం పట్టుబట్టి జూనియర్ బరువు తగ్గేలా చేశారని ప్రచారం జరిగింది. ఈ సినిమాలో జూనియర్ ను జక్కన్న సరికొత్తగా చూపించారు. కాగా, అక్టోబర్ 10 రాజమౌళి పుట్టిన రోజు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా జక్కన్నకు శుభాకాంక్షలు తెలిపారు.

Go Back to Shorts
Jr NTR
Rajamouli
jakkanna
Birthday tweet

More Telugu News