Kanakamedala Ravindra Kumar: చంద్రబాబుతో ఎంపీ కనకమేడల ములాఖత్... జగన్‌పై విమర్శలు

Kanakamedala meets Chandrababu
షార్ట్స్‌లో చూడండి
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సీఎం జగన్ 43 వేలకోట్లు దోచుకున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. రాజమండ్రి కేంద్రకారాగారంలో ఈరోజు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జైల్లో  చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారన్నారు. ఈ రోజుకి కూడా జగన్ బెయిల్‌పై ఉండి కాలయాపన చేస్తున్నారన్నారు.

అలాంటి వ్యక్తి చంద్రబాబు నిజాయతీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక ఆధారాన్ని కూడా చూపలేకపోయారన్నారు. చంద్రబాబుకి ఏ రూపంలో ఎవరి ద్వారా నిధులు ముట్టాయో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఆడిటర్స్ ద్వారా ప్రతి సంవత్సరం లెక్కలు బహిర్గతం చేస్తామన్నారు.
Go Back to Shorts
Kanakamedala Ravindra Kumar
Telugudesam

More Telugu News