అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించనున్న ఇస్రో!
- మీడియా సమావేశంలో వెల్లడించిన ఇస్రో చైర్మన్ సోమనాథ్
- స్పేస్ స్టేషన్‌తో భారత ఆర్థిక వ్యవస్థకు ఏ విధమైన లాభం చేకూరుతుందో పరిశీలిస్తున్నట్టు వెల్లడి
- గగన్‌యాన్‌తో మానస సహిత స్పేస్ ఫ్లైట్ సామర్థ్యం కోసం కృషి చేస్తున్నట్టు వివరణ
- అనంతరం, 20-25 ఏళ్లలో స్పేస్ స్టేషన్ నిర్మాణం సాధ్యపడొచ్చన్న ఇస్రో చీఫ్
ప్రస్తుతం ఇస్రో గగన్‌యాన్‌పై దృష్టి సారించింది. ఆ తరువాత వ్యోమగాములను అంతరిక్షానికి పంపి, అక్కడ స్పేస్ స్టేషన్ నిర్మించాలనే యోచనలో ఉంది. రోబోటిక్ ఆపరేషన్‌తో ఈ ప్రక్రియ నిర్వహిస్తామని ఇస్రో చీఫ్ తెలిపారు. ప్రస్తుతం మానవ సహిత ఫ్లైట్ సామర్థ్యం భారత్‌కు లేనందున ఈ విషయంపై దృష్టి పెట్టామన్నారు. గగన్‌యాన్‌తో ఈ సామర్థ్యం అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గగన్‌యాన్ సాకారమైతే తదుపరి 20-25 ఏళ్లలో స్పేస్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.