వైట్‌హౌస్‌లో చెలరేగిపోతున్న బైడెన్ శునకం.. కరిచిపారేస్తున్న కమాండర్!
- బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వైట్‌హౌస్ సిబ్బంది
- ఇప్పటికే 11 మందికి కుక్కకాటు
- తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన మరికొందరు
- నిజానికీ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందంటున్న వైట్‌హౌస్ వర్గాలు
- బాధితుల్లో ఎగ్జిక్యూటివ్ రెసిడెన్స్ స్టాఫ్, వైట్‌హౌస్ సిబ్బంది
ఈ ఘటనపై యూఎస్ సీక్రెట్ సర్వీస్ చీఫ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆంథోనీ గుగ్లీల్మి మాట్లాడుతూ.. కుక్క కాటుకు సంబంధించిన అధికారిక లెక్కలపై అస్పష్టత ఉందన్నారు. ఎవరూ కచ్చితమైన లెక్కలు చెప్పడం లేదని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనల గురించి నివేదించాల్సిన అవసరం లేదని, ఎందుకంటే అది ఫెడరల్ అధికార పరిధిలో ఉందని తెలిపారు. కాగా, 2021లోనూ వైట్‌హౌస్‌లో ఓ ఇంజినీరు, నేషనల్ పార్క్ సర్వీస్ ఉద్యోగి కూడా కుక్కకాటుకు గురయ్యారు. తాజా ఘటనల నేపథ్యంలో వైట్‌హౌస్ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.