సీఐడీ చీఫ్ సంజయ్‌పై అమిత్ షాకు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
- సర్వీస్ రూల్స్ అతిక్రమించి వైసీపీకి తొత్తులా పని చేస్తున్నారని ఆరోపణ
- జగన్ మెప్పు కోసం ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని విమర్శ
- అమిత్ షాకు ఆధారాలు అందించిన రామ్మోహన్ నాయుడు
సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోపణలు చేయడం తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. దర్యాఫ్తు చేసి, నివేదికను కోర్టుకు సమర్పించాల్సిన బాధ్యత కలిగిన అధికారి ఫక్తు వైసీపీ నేతగా ఢిల్లీ, హైదరాబాద్, అమరావతిలలో మీడియా ముందుకు వస్తున్నారన్నారు. గోప్యంగా ఉంచాల్సిన దర్యాఫ్తు వివరాలను మీడియాకు విడుదల చేస్తున్నారన్నారు. సీఐడీ చీఫ్ సంజయ్ ఉల్లంఘించిన సర్వీస్ రూల్స్, అతిక్రమించిన నిబంధనలకు సంబంధించిన ఆధారాలను అమిత్ షాకు అందజేశారు.