భారత కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన కెనడా పెన్షన్ ఫండ్
- బైజూస్, డైలీహంట్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీల్లో పెట్టుబడులు
- దాదాపు అన్నింటా 1 శాతం నుంచి 6 శాతం మేర వాటాలు
- కోటక్, ఐసీఐసీఐ, విప్రో, ఇన్ఫోసిస్ సంస్థల్లోను ఇన్వెస్ట్ చేసిన సీపీపీఐబీ
ఏ కంపెనీలో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టింది?
అకో కంపెనీలో రూ.292 కోట్ల పెట్టుబడి పెట్టగా, 3.6 శాతం వాటాను కలిగి ఉంది. బైజూస్‌లో రూ.1,456 కోట్లతో 3.4శాతం వాటాను, డెల్హీవెరీలో రూ.897 కోట్లతో 6.1 శాతం వాటాను, డైలీహంట్/వెర్సెలో రూ.207 కోట్లతో 6.2 శాతం వాటాను, ఎరుడిటస్‌లో రూ.7,633 కోట్లతో 4.3 శాతం వాటాను, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,663.50 కోట్లతో 4.3 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే జొమాటోలో 2.37 శాతం వాటా, నైకాలో 1.47 శాతం వాటా, పేటీఎంలో 1.76 శాతం వాటాలను కలిగి ఉంది. పై న్యూఏజ్ కంపెనీలతో పాటు భారత్‌కు చెందిన కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్పోసిస్, విప్రో తదితర ప్రఖ్యాత కంపెనీల్లోను పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుత కెనడా - భారత్ ఉద్రిక్తల నేపథ్యంలో CPPIB ఇన్వెస్ట్ చేసిన పలు కంపెనీలు నష్టాల్లోకి వెళ్లాయి.