KTR: కేటీఆర్‌‌కు స్వాగత ఫ్లెక్సీలు కడుతున్న నలుగురికి కరెంట్ షాక్

Four people electrocuted while arranging KTR flexies
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కోసం హైదరాబాద్‌ లోని కుత్బుల్లాపూర్‌కి వసున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ ఆ ప్రాంతమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఉదయం 5 గంటల సమయంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ బస్టాప్ సమీపంలో కేటీఆర్ ఫ్లెక్సీలు కడుతున్న కొందరికి విద్యుత్ షాక్ తలిగింది. ఈ ఘటనలో విఠల్ (19), దుర్గేష్ (19 ), బాలరాజు (18), నాగనాథ్ (33)కు గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన నాగ్ నాథ్ ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
KTR
Hyderabad
Flexi
electrocuted

More Telugu News