ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్‌లోని కెనడా దౌత్యవేత్తకు భారత్ ఆదేశాలు
- హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తముందని కెనడా ఆరోపణ
- కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు
- తీవ్రంగా స్పందించిన భారత్... కెనడా దౌత్యవేత్త పై వేటు
ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి కామెరూన్ ఈ రోజు ఉదయం చేరుకున్నారు. ఈ సందర్భంగా దౌత్యవేత్తను బహిష్కరిస్తున్న విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ఐదు రోజుల్లో దౌత్యవేత్త దేశాన్ని విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా బహిష్కరించినట్లు తెలిపింది. ఈ అంశంపై విలేకరులతో మాట్లాడేందుకు కామెరూన్ నిరాకరించారు.