ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రిపబ్లికన్ల కుట్ర: బైడెన్
- తనపై అభిశంసన తీర్మానం ప్రచారంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు
- ఇంపీచ్ మెంట్ ప్రచారం ఓ పొలిటికల్ స్టంట్ అని తేల్చేసిన వైట్ హౌస్
- బైడెన్ కు వ్యతిరేకంగా రిపబ్లికన్ల దగ్గర ఆధారాలు లేవని వెల్లడి
చట్ట సభకు ఎన్నికైన వెంటనే తనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారని అన్నారు. తనను దించేయడం తద్వారా ప్రభుత్వాన్ని రద్దు చేయడమే లక్ష్యంగా రిపబ్లికన్లు పనిచేస్తున్నారని బైడెన్ విమర్శించారు. అయితే, ఈ విషయంపై తాను ఎక్కువగా ఆలోచించనని, తనకు ఇతరత్రా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పారు. అంతకుముందు బైడెన్ ఇంపీచ్ మెంట్ వార్తలపై వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రచారం అంతా వట్టిదేనని, బైడెన్ కు వ్యతిరేకంగా రిపబ్లికన్లు ఎలాంటి ఆధారాలు చూపలేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియరె పేర్కొన్నారు. ఇదంతా పొలిటికల్ స్టంట్ గా పియరె కొట్టిపారేశారు.