పొలిటికల్ యాక్షన్ నుంచి ‘ఉస్తాద్’ యాక్షన్‌లోకి పవన్
- ఉస్తాద్ షూటింగ్‌లో చేరిన పవర్ స్టార్
- హైదరాబాద్ లో కొనసాగుతున్న షెడ్యూల్
- దేవాలయం సెట్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
మంగళవారం నుంచి పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్‌లో చేరినట్టు తెలుస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో వెంటనే పవన్ విజయవాడ వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే భైఠాయించి నిరసన తెలిపారు. బాబుకు సంఘీభావం ప్రకటించిన పవన్ రెండు రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చారు. పొలిటికల్ యాక్షన్ నుంచి ఇప్పుడు ఉస్తాద్ సెట్స్‌లో యాక్షన్ లో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ శివార్లలో వేసిన దేవాలయం సెట్‌లో ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పవన్‌పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.