కల్యాణ్ రామ్ ప్యాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్
- టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న మలయాళ నటి
- డెవిల్ చిత్రంలో నైషద పాత్రలో కనిపించనున్న సంయుక్త
- ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం
అభిషేక్ నామా రూపొందిస్తున్న ఈ పీరియాడిక్ మూవీలో బ్రిటీష్ గూఢచారిగా కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. ఆయనకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తోంది. నిన్న ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె నైషద అనే పాత్రను పోషిస్తోందని తెలిపింది. చీరకట్టు చేతిలో పువ్వులు, కొబ్బరికాయతో గుడికి వెళుతున్నట్టుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. కాగా, ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 24న విడుదల కానుంది.