Pawan Kalyan: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి తాజా కబురు

Pawan Kalyan is back on the sets of Ustaad BhagatSingh
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేసిన ‘బ్రో’ సినిమాలో కనిపించిన పవన్ ఈ మధ్యే ‘ఓజీ’ చిత్రం గ్లింప్స్ తో అభిమానులను అలరించారు. ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు గబ్బర్ సింగ్ తో తనకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్ తో పవన్ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ నిన్న హైదరాబాద్‌లో మొదలైంది. ఈ విషయాన్ని చెబుతూ చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.  

ఇందులో పవన్‌ ఖాకీ డ్రెస్సులో స్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. వీటికోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి నేతృత్వంలో భారీ సెట్‌ను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో పవన్ సరసన యువ నటి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అశుతోష్‌ రానా, నవాబ్‌షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.
Go Back to Shorts
Pawan Kalyan
Ustad bhagath singh
harish shankar
new schedule
hyderabad

More Telugu News