Bollywood: బాక్సాఫీస్ వద్ద జవాన్ మేనియా.. తొలి రోజే అన్ని రికార్డులు బ్రేక్!

Jawan Day 1 box office collections shatters records
షార్ట్స్‌లో చూడండి
కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలీవుడ్ అగ్ర నటుడు షారుక్ ఖాన్ కు 2023 బాగా కలిసివస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే పఠాన్ చిత్రంతో భారీ హిట్ సొంతం చేసుకున్న ఆయన తాజాగా జవాన్ చిత్రంతోనూ మెప్పించారు. తొలి రోజే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. పఠాన్ చిత్రం ఏకంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టగా.. ఇప్పుడు జవాన్ కూడా అ స్థాయి వసూళ్లను రాబట్టేలా కనిస్తోంది. ఈ చిత్రం తొలి రోజే రికార్డు కలెక్షన్లను రాబట్టింది. గురువారం విడుదలైన జవాన్ మొదటి రోజు భారత్ లో అన్ని భాషల్లో రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. 

ప్రపంచ వ్యాప్తంగా రూ. 125 నుంచి 150 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇది వరకు భారత్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా పఠాన్ రూ.55 కోట్లతో సాధించిన రికార్డును షారుక్ తాజా చిత్రం జవాన్ బ్రేక్ చేసింది. కాగా, తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రంలో షారుక్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించగా.. దీపిక పదుకొణే, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.
Go Back to Shorts
Bollywood
jawan movie
Shahrukh Khan
Nayanthara
Vijay Sethupathi
box office
record
collections

More Telugu News