ఆ పాత్రకు దక్షిణాదిన జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే న్యాయం చేయగలరు: బాలీవుడ్ దర్శకుడు అనిల్ శర్మ
- జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ సరిపోతుందన్న అభిప్రాయం
- సన్నీడియోల్ కాకుండా మరో నటుడు బాంబేలో కనిపించలేదని వెల్లడి
- సమయం వచ్చినప్పుడు గదర్-3 తీస్తానని బదులు
‘‘యువ నటుల్లో నాకు ఎవరూ కనిపించలేదు. బాంబేలో అలాంటి వారిని ఎవరినీ చూడలేదు. దక్షిణాదిన అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ పాత్రను చేయగలరు. ఆయనకు ఉన్న ఇమేజ్ ఇందుకు సరిపోతుంది’’ అని అనిల్ శర్మ పేర్కొన్నారు. సకీనా పాత్రకు వేరొకరి పేరును ఆయన చెప్పలేకపోయారు. అనిల్ శర్మ తెరకెక్కించిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ సినిమా 2001 జూన్ 15న విడుదల కాగా, గదర్-2 2023 ఆగస్ట్ 11న విడుదల కావడం గమనార్హం. గదర్-3లో సన్నీడియోల్ తాత పాత్రను పోషిస్తారా? అని ప్రశ్నించగా.. గదర్-3 గురించి మాట్లాడనంటూనే, సమయం వచ్చినప్పుడు తీస్తానని బదులిచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి పరిచయడం కావడం తెలిసిందే.