Advertisement

బ్రాహ్మణి భర్తగా.. బాలకృష్ణ అల్లుడిగా.. చంద్రబాబు కొడుకుగా తప్ప ఇంకేం గుర్తింపు ఉంది?: లోకేశ్‌పై మార్గాని భరత్ వ్యంగ్యం

MP Margani Bharath satire on Nara Lokesh
  • ఎలాంటి ప్రత్యేక అర్హతలు లేని వ్యక్తి లోకేశ్ అని ఎద్దేవా
  • జగన్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం విడ్డూరమని వ్యాఖ్య
  • కనీసం వార్డు మెంబర్‌గా గెలవలేని వ్యక్తి అన్న ఎంపీ
  • అర్ధరాత్రి పాదయాత్ర చేసే నాయకుడంటూ సెటైర్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు అని తప్ప ఎలాంటి ప్రత్యేక అర్హత లేని వ్యక్తి లోకేశ్ అన్నారు. ముద్దపప్పు లోకేశ్.. బ్రాహ్మణి భర్తగా, బాలకృష్ణ అల్లుడిగా, చంద్రబాబు కొడుకుగా తప్ప ఇంకేం గుర్తింపు ఉందన్నారు. అలాంటి వ్యక్తి సీఎం జగన్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. లోకేశ్ కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవాలనుకునే నాయకులు పగటిపూట పాదయాత్ర చేస్తారని, కానీ లోకేశ్ మాత్రం అర్ధరాత్రి పాదయాత్ర చేస్తారని ఎద్దేవా చేశారు. తెల్లవారుజామున పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Advertisement
Margani Bharat
YSRCP
Nara Lokesh
Telugudesam

More Telugu News