మగధీర సమయంలో పల్పిట్ రాక్స్ ఫొటోలు చూశాను... ఇన్నాళ్లకు సందర్శించాను: రాజమౌళి
- ఇన్ స్టాగ్రామ్ లో రాజమౌళి పోస్టు
- నార్వే వెళ్లిన రాజమౌళి
- స్టావెంజర్ లో బాహుబలి కచేరీకి హాజరు
- ప్రపంచ ప్రఖ్యాత పల్పిట్ రాక్స్ సందర్శన
దీనిపై ఆయన స్పందిస్తూ... "మగధీర సమయంలో లొకేషన్స్ కోసం వెతికే సమయంలో ఈ పల్పిట్ రాక్స్ ఫొటోలు చూశాను. అప్పటి నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటున్నాను. అది ఇన్నాళ్లకు కుదిరింది. అందుకు బాహుబలికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే, నార్వేలోని స్టావెంజర్ లో 'బాహుబలి' సినిమా సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం మేం నార్వే రావడంతో ఇక్కడి పల్పిట్ రాక్స్ ను సందర్శించడానికి వీలైంది" అని వివరించారు.


