Renu Desai: అందుకే పవన్ నిన్ను తరిమేశాడు మేడమ్ అన్న నెటిజెన్.. రేణు దేశాయ్ స్పందన ఇదే!

Renu Desai reply to a netizen who criticised her
షార్ట్స్‌లో చూడండి
తన మాజీ భర్త పవన్ కల్యాణ్ కు డబ్బంటే ఆసక్తి లేదని, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అని రేణు దేశాయ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరోవైపు పవన్ ను వ్యతిరేకించే వాళ్లు మాత్రం రేణుని ట్రోల్ చేస్తున్నారు. 

తాజాగా రేణును ఉద్దేశించి ఓ నెటిజెన్ ఓ కామెంట్ చేశాడు. అందుకే పవన్ నిన్ను తరిమేశాడు మేడం అంటూ అతను వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై రేణు స్పందిస్తూ... తనను అనడం వల్ల నీకు మనశ్శాంతి దొరికిందా? అని ప్రశ్నించింది. మనశ్శాంతి దొరక్కపోతే ఇంకా తిట్టండని కూల్ గా చెప్పారు. తన మాజీ భర్త అభిమానులు, ఆయన వ్యతిరేకుల నుంచి తిట్లు తినడానికే తన జీవితం ఉందని ఆమె అన్నారు. 

తన విడాకుల గురించి నిజాలు మాట్లాడినప్పుడు తనను తన మాజీ భర్త అభిమానులు తిట్టారని... ఇప్పుడు దేశ పౌరురాలిగా ఆయన గురించి మంచిగా మాట్లాడితే ఆయన వ్యతిరేకులు తనను తిడుతున్నారని రేణు చెప్పారు. డబ్బులు తీసుకుని విడాకుల గురించి మాట్లాడానని అప్పట్లో పవన్ అనుకూలురు తిట్టారని... డబ్బులు తీసుకుని పవన్ కు అనుకూలంగా మాట్లాడానని ఇప్పుడు పవన్ వ్యతిరేకులు తిడుతున్నారని అన్నారు. తాను చెప్పినవన్నీ నిజాలేనని చెప్పారు. ప్రేమలో పడినందుకు, నిజాలు మాట్లాడినందుకు తనకు దక్కింది ఇదేనని అన్నారు. తన తలరాత ఇదే అనుకుంటే... ఇంకా తిట్టండి అని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Renu Desai
Tollywood
Pawan Kalyan
Janasena

More Telugu News